← Back to news

ములుగులో రైస్ మిల్లర్ల మహా ధర్నా

By Bala· 2h ago· TG
ములుగులో రైస్ మిల్లర్ల మహా ధర్నా

TG: ములుగు జిల్లా కేంద్రంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా ధర్నా కొనసాగుతోంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మిల్లర్లు ప్లకార్డులతో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోస్టాఫీస్ ఎదుట ఏర్పాటు చేసిన టెంట్ వద్ద ఆందోళన చేపట్టనున్నారు. విజిలెన్స్ దాడులు నిలిపివేయాలని, గోదాముల్లో స్థలం కేటాయించాలని, మిల్లింగ్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

More in TG