← Back to news

ఏపీలో వర్షాలు.. మత్స్యకారులకు హెచ్చరిక

By Sharmila· 4d ago
ఏపీలో వర్షాలు.. మత్స్యకారులకు హెచ్చరిక

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారింది. నేటి నుంచి ఈ నెల 19 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడే సూచనలు ఎక్కువ ఉండడంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

More in AP