తెలంగాణలో MBBS, BDS ప్రవేశాలకు మళ్లీ రిజిస్ట్రేషన్

TG: MBBS, BDS అడ్మిషన్ల కోసం చూస్తున్న స్టూడెంట్స్‌కు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తిరిగి స్టార్ట్ చేసినట్టు పేర్కొంది. స్టూడెంట్స్ రిక్వెస్ట్‌లను పరిగణంలోకి తీసుకుని ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు మరో అవకాశం కల్పించినట్లు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు అడ్మిషన్ <a href="https://tsmedadm.tsche.in/">పోర్టల్</a> చూడొచ్చు.



