6Gలో భారత్ రూల్స్ సెట్ చేయబోతోందా?

5Gలో మనం టెక్నాలజీ వాడిన దేశంగా ఉంటే.. 6Gలో మాత్రం రూల్స్ సెట్ చేసే దేశాల్లో ఒకటిగా మారాలని భారత్ టార్గెట్ పెట్టుకుంది. తాజాగా అమెరికా సహా 20కిపైగా దేశాలతో కలిసి 6G లీడర్‌షిప్, సెక్యూరిటీపై భారత్ కీలక ఒప్పందానికి మద్దతు ఇచ్చింది. అంతేకాదు, 2030 నాటికి ప్రపంచ 6G స్టాండర్డ్స్, పేటెంట్లలో 10 శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ 6G అలయన్స్‌లో ఇప్పటికే 90 సంస్థలు ఉన్నాయి. 6G వచ్చినప్పుడు కేవలం నెట్‌వర్క్ వాడటం కాదు.. అది ఎలా ఉండాలో నిర్ణయించే చర్చల్లోనూ భారత్ బలంగా ఉండబోతోంది!



