ప్లాస్టిక్ నిర్మూలనకు భారీ ర్యాలీ

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలనే సందేశంతో కర్నూలు జిల్లా దేవనకొండలో విద్యార్థులు, అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవా–2026లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా జ్యూట్ బ్యాగులను ఉపయోగించాలని అవగాహన కల్పించారు. ర్యాలీలో దేవనకొండ MPDO జ్యోతి, PDO శంకరమ్మ, జూనియర్ కళాశాల, ZPHS విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

