← Back to news

49 కుటుంబాలపై గ్రామ బహిష్కరణ

By Samrat Ashok· 1d ago
49 కుటుంబాలపై గ్రామ బహిష్కరణ

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన 39 గౌడ, 10 ఎస్సీ కుటుంబాలు తమపై గ్రామ బహిష్కరణ విధించారని ఆరోపిస్తూ నిజామాబాద్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ తమను సామాజికంగా బహిష్కరించిందని బాధితులు తెలిపారు. ఇది రెండోసారి బహిష్కరణకు గురవుతున్నామని చెప్పారు. గ్రామంలో తమతో మాట్లాడకుండా, సరుకులు ఇవ్వకుండా కిరాణా దుకాణాలకు ఆంక్షలు విధించారని ఆరోపించారు. తమతో మాట్లాడినా, సరుకులు అందించినా 25 వేల జరిమానా విధిస్తామని VDC హెచ్చరించిందని తెలిపారు.

More in Local