NSS డే.. మొక్కలు నాటిన స్టూడెంట్స్!

మహబూబ్‌నగర్ జిల్లాలో NSS దినోత్సవం సందర్భంగా NTR ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ అమీనా ముంతాజ్ జహాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. NSS వాలంటీర్లు, అధ్యాపకులు వివిధ రకాల మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రిన్సిపాల్ అన్నారు. NSS ఆవిర్భావం, సేవాభావం, సామాజిక బాధ్యతపై ప్రత్యేక సమావేశంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు, అధ్యాపకులు, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.




