← Back to news

కూటమి సీట్ల సర్దుబాటు ఖరారు!

By Prashanth· 4d ago
కూటమి సీట్ల సర్దుబాటు ఖరారు!

AP: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. మొత్తం 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోటీపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. జనసేనకు 4 కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, BJPకి ఒక కార్పొరేషన్, 6 మున్సిపాలిటీలు కేటాయించినట్లు సమాచారం. మిగిలిన 12 కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీల్లో TDP పోటీ చేయనుంది. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందనే పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

More in AP