AI ఉద్యోగాలపై Singapore కొత్త ప్లాన్!

AI వచ్చాక “నా ఉద్యోగం ఉంటుందా?” అనే భయం చాలామందిలో పెరుగుతోంది. 🤖 కానీ సింగపూర్ మాత్రం ఉద్యోగాలు పోయే వరకు ఆగకుండా.. ముందే స్కిల్ మార్చే ప్లాన్‌తో వెళ్తోంది. ప్రభుత్వం, కంపెనీలు, కార్మిక సంఘాలు కలిసి AI వల్ల ఉద్యోగాల్లో వచ్చే మార్పులను ఎదుర్కొనేందుకు కొత్త కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఉద్యోగాలు పూర్తిగా పోవడం కంటే, పనులు మారి కొత్త బాధ్యతలు రావడంపై ఫోకస్ చేస్తున్నారు. అందుకే కార్మికులకు AI, కొత్త స్కిల్స్ నేర్పించి, అవసరమైతే మరో ఉద్యోగానికి మారేందుకు ట్రైనింగ్, కెరీర్ సపోర్ట్ ఇవ్వనున్నారు.



