100 ఏళ్ల వయసులో లాయర్‌కు అరుదైన గుర్తింపు!

కేరళకు చెందిన పి. బాలసుబ్రమణియన్ మీనన్‌కు హైకోర్టు సీనియర్ అడ్వొకేట్‌గా గుర్తింపు ఇచ్చింది. 1950లో లాయర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. 76 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్టోబర్ 15న 100వ బర్త్‌డే జరుపుకోనున్నారు. సుదీర్ఘకాలం లాయర్‌గా పనిచేసిన వ్యక్తిగా 2023లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూనే ఈ గుర్తింపు అందుకోవడం స్పెషల్‌గా నిలిచింది. వయసు 100కు చేరినా, లాయర్‌గా ఆయన జర్నీ ఇంకా కొనసాగుతోంది.



