← Back to news

లవర్ పెళ్ళికి నో చెప్పిందని టవర్ ఎక్కిన యువకుడు

By sahani· 4 Apr 2026· Telugu Report· Hyderabad
లవర్ పెళ్ళికి నో చెప్పిందని టవర్ ఎక్కిన యువకుడు

హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని చింతలకుంట వద్ద రేడియో టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ చేస్తున్నాడు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి అంగీకరించలేదని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. యువకుడితో పోలీసులు ఫోన్‌లో మాట్లాడుతున్నారు. అతడికి నచ్చజెప్పి కిందకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనాస్థలిలో స్థానికులు గుమిగూడి వీడియోలు తీస్తుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

More in Local