ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నిర్మాత

'కేవీఎన్ ప్రొడక్షన్స్' అధినేత, ప్రముఖ నిర్మాత వెంకట్ కె. నారాయణను ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సీఎం విజయ్ సర్కార్ నియమించింది. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సీఎం విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ను కేవీఎన్ బ్యానర్‌పై ఆయనే నిర్మించారు. గతంలో ప్రెస్టీజ్ గ్రూప్ సీఈఓగా పనిచేసిన వెంకట్, చార్టర్డ్ అకౌంటెంట్‌గాను మంచి గుర్తింపు పొందారు. అయితే ఈ నియామకంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.


