చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించాలి

నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని 7వ వార్డు మెంబర్ రొడ్డ వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, వంటకాల నాణ్యత, ఆహార పదార్థాల పరిమాణం, చిన్నారుల బరువులను స్వయంగా పరిశీలించారు. చిన్నారుల హాజరు, రికార్డులు, రిజిస్టర్లు, ఆహార పంపిణీ వివరాలను కూడా తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం కేంద్రం నిర్వహణ జరుగుతుందా అనే అంశాన్ని పరిశీలించారు.





