← Back to news

రచయిత ఉదయభాను ఇక లేరు

By AR· 10 Apr 2026· Telugu Report· Hyderabad
రచయిత ఉదయభాను ఇక లేరు

ప్రముఖ రచయిత ఎం. ఉదయభాను (73) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో స్వగృహంలో కన్నుమూశారు. కొన్ని వందల కథలు, నవలలు రాశారు. ఆయన రాసిన ది గైడ్ నవల ఆంధ్రభూమి వార పత్రిక పోటీలో ఉత్తమ నవలగా ఎంపికైంది. అనువాద రచనలకు ఉదయభాను పెట్టింది పేరు. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో అపరాధి శీర్షికతో ఉదయభాను రాసిన క్రైమ్ స్టోరీస్ పాఠకాదరణ పొందాయి. మహాకవి దాశరథికి ఆయన స్వయానా మేనల్లుడు.

More in Local