← Back to news

ప్రజావాణిలో వినతుల వెల్లువ.. సమస్యలను పరిష్కరించాలి

By Madhu Gadenaveni· 17 Aug 2026· Thangallapalle, Thangallapalli, Rajanna Sircilla

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 20 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో రమేష్ తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. విధుల నిర్వహణలో సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.

More in Local