← Back to news

గోకవరం రోడ్లు నిర్మానుష్యం

By gani gani· 1d ago· Gokavaram, Gokavaram, East Godavari
గోకవరం రోడ్లు నిర్మానుష్యం

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. వర్షాల ప్రభావంతో జనజీవనం స్తంభించగా, రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. చిరు వ్యాపారాలు కూడా మూతపడ్డాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

More in Local