గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం జమాల్‌పురంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం MPC, BiPC గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శైలజ రాణి తెలిపారు. అర్హులైన గిరిజన విద్యార్థినులు ఇవాళ నుంచి 26వ తేదీ వరకు అవసరమైన సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలకు వచ్చి సంప్రదించాలని సూచించారు. ఖాళీ సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.



