← Back to news

మనిషికంటే వేగంగా పరిగెత్తే రోబోట్! 🤖

By Nani· 20 Aug 2026
మనిషికంటే వేగంగా పరిగెత్తే రోబోట్! 🤖

రోబోట్ పరుగెత్తడం చూశాం.. కానీ ఇది చూసిన తర్వాత ఒక్క ప్రశ్న వస్తుంది: మనిషికంటే వేగంగా రోబోట్ ఎలా పరిగెడుతోంది? చైనాకు చెందిన Unitree రూపొందించిన ‘Superman’ అనే హ్యూమనాయిడ్ రోబోట్ సెకనుకు 12.66 మీటర్ల వేగంతో పరుగెత్తగలదని సంస్థ చెబుతోంది. అంతేకాదు, రెండు మీటర్ల ఎత్తు దూకగలదట. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ రోబోట్‌ను మూడు నెలల్లోనే అభివృద్ధి చేశామని కంపెనీ చెబుతోంది. అయితే ఈ వేగం నిజ జీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది? మనుషుల మధ్య సురక్షితంగా పనిచేయగలదా? అసలు పరీక్ష ఇక్కడే మొదలవుతుంది.

More in Technology