రిలీజ్ తర్వాత ధ్రువ్ రాఠీ షెడ్యూల్

ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో అరెస్టయి విడుదలైన యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు సీనియర్ అడ్వకేట్, MP కపిల్ సిబల్‌ను కలవనున్నారు. ఈ విషయాన్ని ఆయన 'X' వేదికగా తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ వివాదం, నిరసనకారుల నిర్బంధంపై వీరు మీటింగ్‌లో చర్చిస్తారు. మీటింగ్ ముగిసిన వెంటనే పూర్తి వివరాలను మీడియాతో మాట్లాడనున్నట్లు ధ్రువ్ రాఠీ 'X' లో షేర్ చేశారు. ప్రజెంట్ దేశవ్యాప్తంగా CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ నిరసనలు ఉద్రిక్తం అవుతున్నాయి.


