ఏపీ - ఒడిశా నేషనల్ హైవే బంద్

తుఫాను తీవ్రతతో కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం జిల్లా చింతూరు మండలంలోని కుయుగూరు వాగు భయంకరంగా పొంగిపోర్లుతోంది. వరద నీరు జాతీయ రహదారి-326 పైకి చేరడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకు వెళ్లే ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డుపై నీరు పారుతుండటంతో రాకపోకలు బంద్ అయి, ఇరువైపులా వందలాది వాహనాలు, లారీలు ఎక్కడికక్కడే జామ్ అయ్యాయి. ప్రయాణికులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



