పేరంపల్లి చెరువులో యువకుడి మృతదేహం లభ్యం!

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం పేరంపల్లి చెరువులో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు మృతుడిని గాలివీడు సిద్దయ్య (20)గా గుర్తించారు. ఈ నెల 19న వినాయక నిమజ్జనం కోసం చెరువు వద్దకు వచ్చిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.



