పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీపై సుప్రీం కీలక కామెంట్స్

పిల్లలు సోషల్ మీడియా వాడకంపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. పిల్లలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఈజీగా యాక్సెస్ చేస్తుండటంతో.. వారికి సేఫ్టీ గైడ్‌లైన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. ఆన్‌లైన్ వేధింపుల నుంచి మైనర్లను ఎలా కాపాడతారో చెప్పాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ పిటిషన్‌పై విచారణలో ఈ కామెంట్స్ చేసింది. ఆటో కంటెంట్ ఫిల్టర్లు, ఏజ్ వెరిఫికేషన్ ఉండాలని పిటిషనర్లు కోరారు. అల్గారిథమ్స్ పిల్లలకు ఏజ్‌కు మించిన కంటెంట్ చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.



