← Back to news

కులతత్వం అంతమైతే నో రిజర్వేషన్స్

By Sahani· 9h ago· India
కులతత్వం అంతమైతే నో రిజర్వేషన్స్

దేశంలో కులతత్వాన్ని రద్దు చేస్తే తాము రిజర్వేషన్లు వదులుకుంటామని కేంద్రమంత్రి, RPI చీఫ్ రాందాస్ అఠావలె అన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధమని, వెనుకబడిన వర్గాల కోసమే వాటిని తెచ్చారని చెప్పారు. అంటరానితనం నిషేధించినా దళితులు, గిరిజనులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గార్భా నృత్యాల్లోకి ముస్లింలను అనుమతించవద్దన్న VHP పిలుపును తప్పుపట్టారు. రాజ్యాంగం ప్రకారం ఏ మతపరమైన ఈవెంట్స్‌లోనైనా భారతీయులందరూ పాల్గొనవచ్చని తేల్చిచెప్పారు.

More in Current Affairs

పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీపై సుప్రీం కీలక కామెంట్స్
Current Affairs· 4h ago

పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీపై సుప్రీం కీలక కామెంట్స్

పిల్లలు సోషల్ మీడియా వాడకంపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. పిల్లలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఈజీగా యాక్సెస్ చేస్తుండటంతో.. వారికి సేఫ్టీ గైడ్‌లైన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. ఆన్‌లైన్ వేధింపుల నుంచి మైనర్లను ఎలా కాపాడతారో చెప్పాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ పిటిషన్‌పై విచారణలో ఈ కామెంట్స్ చేసింది. ఆటో కంటెంట్ ఫిల్టర్లు, ఏజ్ వెరిఫికేషన్ ఉండాలని పిటిషనర్లు కోరారు. అల్గారిథమ్స్ పిల్లలకు ఏజ్‌కు మించిన కంటెంట్ చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.