← Back to news

రాజాం నియోజకవర్గంలో వరద బీభత్సం

By Mohan· 1d ago· Rajam, Rajam, Vizianagaram

భారీ వర్షాలతో విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో వరద పెద్దఎత్తున వచ్చి చేరింది. వాగులు, కాల్వలు పొంగిపొర్లడంతో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బలమైన ఈదురుగాలులకు చెట్లు విరిగిపడి రేగిడి–రాజాం ప్రధాన రహదారిలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిపై రెవెన్యూ, విద్యుత్, పోలీస్ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. JCBల సాయంతో రోడ్లపై పడిన చెట్లను తొలగిస్తూ రాకపోకలను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.

More in Local