చెరువులోకి నీరు చేరడంతో...కట్టమైసమ్మకు పూజలు

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలోని ఊర చెరువులోకి వర్షపు నీరు చేరడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ గాయం ఉదయశ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ కట్టమైసమ్మ అమ్మవారి ఆలయం వద్ద దేవాలయ కమిటీ చైర్మన్ పొనుగోటి శ్రీధర్ రావు, వైస్ చైర్మన్ కోడి వీరస్వామి ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.



