← Back to news

చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

By Sunke Vinith· 1h ago
చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

TG: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల గ్రామీణ మండలం కల్లెడ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారిని మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం గుడిరేవు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More in Local