రాజోలులో వీఆర్ఏల అర్ధనగ్న నిరసన

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వీఆర్ఏ JAC పిలుపుతో చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం గురువారానికి తొమ్మిదో రోజుకు చేరింది. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ వీఆర్ఏలు నిరసన కొనసాగించారు. అర్హత ఉన్న వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని, పే స్కేల్ అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.



