నీకు నచ్చిందనుకుంటున్నావ్.. కానీ ఆ ఛాయిస్ నీదేనా?

“నాకు నచ్చింది కాబట్టే ఈ వీడియో చూస్తున్నా” అనుకుంటాం.. కానీ ఆ వీడియో మనకు ఎందుకు కనిపించిందో ఎప్పుడైనా ఆలోచించారా? Social Mediaలో మనం ఏ పోస్టు దగ్గర ఆగాం, ఏ వీడియోను ఎక్కువసేపు చూశాం, దేనికి స్పందించాం.. ఇవన్నీ గమనించే అల్గారిథమ్స్ తర్వాత మనకు ఇలాంటి కంటెంట్‌నే ఎక్కువగా చూపిస్తాయి. క్రమంగా మనకు నచ్చే బ్రాండ్లు, కొనాలనిపించే వస్తువులు, చివరికి కొన్ని అభిప్రాయాలు కూడా ప్రభావితం కావచ్చు. అంటే మనం నిర్ణయం తీసుకుంటున్నట్టు అనిపించినా, ఆ నిర్ణయానికి ముందే మన స్క్రీన్ మనల్ని ఒక దిశలో నడిపిస్తుండొచ్చు.

