← Back to news

రోడ్లు, ఇళ్లలోకి చేరుతున్న వరద నీరు

By gani gani· 1d ago· Gokavaram, Gokavaram, East Godavari
రోడ్లు, ఇళ్లలోకి చేరుతున్న వరద నీరు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో భారీ వర్షాలతో బురద కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కాలువ నీరు రోడ్లపైకి, ఇళ్లలోకి చేరే పరిస్థితి ఏర్పడటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

More in Local