← Back to news

కుకునూర్‌లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి

By Premdas Talari· 16 Aug 2026· Kuknoor, Yeldurthy, Medak
కుకునూర్‌లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి

TG: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని యువత, గ్రామ ప్రజలు కోరుతున్నారు. స్కూల్ ఏర్పాటుకు అవసరమైన ఐదెకరాల భూమి, తరగతి గదులు, తాగునీరు, విద్యుత్, విశాలమైన ఆటస్థలం, రహదారి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కుకునూర్ గ్రామం వెల్దుర్తి మండలంలో భాగమేననే విషయాన్ని మండల కేంద్ర ప్రజలు గుర్తించాలని వారు కోరారు. గతంలో వెల్దుర్తి మండలానికి మంజూరైన మైనారిటీ పాఠశాల, జ్యోతిబా ఫూలే పాఠశాలలు ప్రస్తుతం తూప్రాన్‌లో నిర్వహించబడుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

కుకునూర్‌లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి

More in Local