ట్రెండింగ్‌లో విమలక్క ప్రొటెస్ట్ సాంగ్!
తెలంగాణ విమలక్క పాడిన ‘ఎవరో ఒకరు ఎపుడో అపుడు పుడతారులే.. మళ్లీ మళ్లీ’ పాట సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఈ పాటను రెలారే ప్రసాద్ రీక్రియేట్ చేశారు. అంబేద్కర్, భగత్ సింగ్, చే గువేరా చిత్రాలతో పాటు నిరసన విజ్యువల్స్ యాడ్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రజల బాధను తమ బాధగా భావించి, సమాజ మార్పు కోసం పోరాడే వ్యక్తులు మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటారనే భావం ఈ పాటలో ఉంది. అందుకే విప్లవ, సామాజిక న్యాయ ఉద్యమాల్లో ఈ పాటకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

