స్టేజ్ మీద ఏడ్చేసిన రితేష్-జెనీలియా..
బాలీవుడ్ క్యూట్ కపుల్ రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా ఒక అవార్డు ఫంక్షన్ లో ఎమోషనల్ అయ్యారు. తన సక్సెస్ కి కారణం తన భార్య జెనీలియానే అని రితేష్ స్టేజ్ మీద అందరి ముందు పొగిడారు. ఆ మాటలకు జెనీలియా ఎమోషనల్ అవ్వగా, ఆమెను చూసి రితేష్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ చూసి నెటిజన్లు వీరు కదా రియల్ బెస్ట్ జోడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

