క్యాన్సర్ మందుల ధరలకు కత్తెర.. రోగులకు భారీ ఊరట!

క్యాన్సర్ మందుల ధరలకు కేంద్రం కత్తెర వేసింది. ధరల నియంత్రణలో లేని మందులపై ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేసింది. ఈ నెలాఖరు నుంచి 35 పేటెంట్ మందులు సహా 110 రకాల ఔషధాల ధరలు తగ్గనున్నాయి. రోగులకు ఏడాదికి ₹2,500 కోట్లు ఆదా అవుతాయని అంచనా. బ్రాండెడ్, జెనరిక్, స్వదేశీ, విదేశీ మందులకూ ఈ నిబంధన వర్తిస్తుంది. మందుల అధిక ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఔషధ కంపెనీల అక్రమ వ్యాపారాలను అరికట్టేందుకు చట్టం తేవాలని కేంద్రానికి సూచించింది.



