← Back to news

శాన్ డియాగో మసీదులో కాల్పులు .. ముగ్గురు మృతి

By aravinda nyayapati· 19 May 2026· Sanfransisco
శాన్ డియాగో మసీదులో కాల్పులు .. ముగ్గురు మృతి

అమెరికాలోని శాన్ డియాగోలో దారుణం జరిగింది. ఒక మసీదు ప్రాంగణంలోకి చొరబడిన ఇద్దరు టీనేజ్ సాయుధులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత నిందితులిద్దరూ శవాలుగా కనిపించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆయుధాలపై యాంటీ ముస్లిం మెసేజ్లు, సూసైడ్ నోట్ దొరకడంతో FBI రంగంలోకి దిగి దీనిని Hate Crime కోణంలో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటన ఈద్‌కు ముందు జరగడం అక్కడి ముస్లిం కమ్యూనిటీలో భయాందోళనలు పెంచింది.

More in World