హంగర్ స్ట్రైక్‌కు ముందు.. 555 కి.మీ దూరం తీసుకెళ్లారా?

IIT బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే తల్లిదండ్రులు సంచలన ఆరోపణ చేశారు. కొడుకు మృతిపై IIT బాంబే వద్ద హంగర్ స్ట్రైక్ చేయాల్సిన కొన్ని గంటల ముందు, తమకు ఇష్టం లేకున్నా పోలీసులు ప్రైవేట్ కారులో ముంబై నుంచి 555 కి.మీ దూరంలోని వాషిమ్‌కు తీసుకెళ్లారని చెప్పారు. తాము ముంబైలోనే ఉండాలని చెప్పినా వినలేదన్నారు. తిరిగి ముంబై వెళ్లి హంగర్ స్ట్రైక్ కొనసాగిస్తామని తెలిపారు. అయితే పోలీసులు దీన్ని ఖండించారు. తల్లిదండ్రులే యవత్మాల్ వెళ్లాలని కోరారని తెలిపారు.



