"TDP అరాచకం": సజ్జల

AP: నిన్న, ఇవాళ TDP అరాచకం సృష్టిస్తోంది అని YCP సీనియర్ నేత సజ్జల రామకృష్ణ ఆరోపించారు. "కావాలని కాలిక్యులేటెడ్గా హింస చేస్తున్నారు. అసలు ఎక్కడా నామినేషన్ వెయ్యకుండా చెయ్యడమే టార్గెట్గా దాడులు చేస్తున్నారు. మా అభ్యర్థులను ఎత్తుకుపోతున్నారు. ఎలక్షన్ కమిషన్ డమ్మీ అయిపోయింది. YCP అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తీసుకోవట్లేదు. పోలీసులే YCP అభ్యర్థులను తరిమేస్తున్నారు" అని ఆయన అన్నారు. గెలుస్తామనే నమ్మకం లేకే TDP ఇలా చేయిస్తోందని సజ్జల విమర్శించారు.

