← Back to news

భూపాలపల్లిలో వర్ష బీభత్సం.. సింగరేణికి భారీ నష్టం

By Bala· 5h ago

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. కాకతీయ ఓపెన్‌కాస్ట్‌-2, 3 గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో బొగ్గు వెలికితీసే యంత్రాలు నీటిలో చిక్కుకున్నాయి. దీంతో రెండు రోజుల్లో సుమారు 16 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాల ప్రభావంతో సింగరేణికి దాదాపు రూ. 2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

More in Local