← Back to news

షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి నిధులు వెంటనే విడుదల చేయాలి

By Naveed Mohd.· 17 Aug 2026
షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి నిధులు వెంటనే విడుదల చేయాలి

TG: పేద కుటుంబాలకు అండగా నిలిచే షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాల నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ముచ్చర్ల సాగర్‌ మాట్లాడుతూ షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాల లబ్ధిదారులకు నిధులు అందకపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. అర్హులైనవారి ఖాతాలో నిధులు జమ చేయాలని డిమాండ్‌ చేశారు.

More in Local