← Back to news

ఆయన ప్రాణాలు రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే: మంద కృష్ణ

By DK· 30 Jun 2026
ఆయన ప్రాణాలు రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే: మంద కృష్ణ

TG: BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ IPS అధికారి RS ప్రవీణ్‌కుమార్‌ ప్రాణాలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని MRPS జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు భద్రత కుదించడంపై CM రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా చట్ట విరుద్ధంగా సెక్యూరిటీని సర్కార్ తొలగించిందని లేఖలో వివరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ప్రతిపక్ష నేత, మాజీ పోలీస్ అధికారికి సెక్యూరిటీ ఎలా తొలగిస్తారని నిలదీశారు.

More in Politics