← Back to news

శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ఒక్కసారిగా కొండచరియలు

By DK· 2h ago
శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ఒక్కసారిగా కొండచరియలు

భారీ వర్షాలకు నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. శ్రీశైలం జలాశయం సమీపంలో కొండపై నుంచి బండరాళ్లు ఒక్కసారిగా రోడ్డుపై పడటంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అయితే ఆ సమయంలో వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గత రెండు రోజులుగా శ్రీశైలం మండలంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో బండరాళ్లు జారిపడ్డాయి. కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

More in Local