← Back to news

దువ్వూరులో కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె

By DK· 3h ago
దువ్వూరులో కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె

కడప జిల్లా దువ్వూరులో వీఆర్ఏల నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. తహసీల్దార్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని తహసీల్దార్ సునీత సందర్శించి వీఆర్ఏలకు సంఘీభావం తెలిపారు. వీఆర్ఏలు కార్యాలయం నుంచి స్టేట్ బ్యాంక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ వేతనాలు పెంచడంతో పాటు DA, HRA అమలు చేయాలని, అర్హులైన వీఆర్ఏలకు VROలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. నామినీ VROలుగా పనిచేస్తున్న వారిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

More in Local