సిగరెట్ తాగకపోయినా ప్రాణానికి ప్రమాదం!

ఇతరులు కాల్చే సిగరెట్ పొగ పీల్చడం వల్ల భారత్లో మరణాలు దాదాపు 50 శాతం పెరిగాయని లాన్సెట్ జర్నల్ రిపోర్ట్ తెలిపింది. దీనివల్ల దేశంలో చనిపోయిన వారి సంఖ్య 1990లో 2లక్షల 17 వేలు ఉండగా.. 2023 నాటికి ఏకంగా 3లక్షల 25 వేలకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 44 కోట్ల 40 లక్షల ప్రజలు ఈ పొగ బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 271 కోట్ల మంది బాధితుల్లో సగానికి పైగా చైనా, భారత్, ఇండోనేషియాలోనే ఉన్నారు. వీళ్లలో 7కోట్ల 60 లక్షల మంది 14 ఏళ్ల లోపు పిల్లలే ఉన్నారు.



