← Back to news

చింతలమ్మ ఘాట్‌లో హైఅలర్ట్

By Somesh Kumar Madapala· 1d ago· Koyyuru, Koyyuru, Alluri Sitharama Raju

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జాతీయ రహదారి NH-516E పరిధిలోని చింతలమ్మ ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్లు, మట్టి దిబ్బలు రోడ్డుపైకి జారిపడటంతో వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చింతలమ్మ ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. రహదారి సురక్షితమని అధికారులు ప్రకటించే వరకు వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించవద్దని తెలిపారు.

More in AP