Fake ID కార్డులతో ఎంట్రీ.. కేబుల్స్ చోరీ

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నకిలీ ID కార్డులతో ప్రవేశించి కాపర్ కేబుల్స్ చోరీ చేస్తున్న ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు క్రైమ్ ACP వెంకటరావు, సౌత్ క్రైమ్ CI జీడీ బాబు తెలిపారు. నిందితుల నుంచి సుమారు 300 కిలోల కాపర్ కేబుల్స్, రెండు రబ్బరు స్టాంపులు, ఐదు నకిలీ ID కార్డులు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్టయిన వారిలో పైడిపాటి వెంకట భార్గవ్, పోతిన శ్రీకాంత్, ఇసుకపల్లి నాగేంద్ర వర్మ, గర్తియ రవిశంకర్, బంగారు సతీష్ కుమార్, ఇసుకపల్లి వంశీ, నవాబు యువరాజు ఉన్నారు.



