← Back to news

పాలకుర్తి గురుకులంలో ఎలుకల భయం

By Bala· 4h ago
పాలకుర్తి గురుకులంలో ఎలుకల భయం

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎలుకల బెడదతో 14 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం అనంతరం నిద్రిస్తున్న సమయంలో విద్యార్థినుల చేతులు, కాళ్లపై ఎలుకలు కరిచినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్‌ వరలక్ష్మి వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వ్యాక్సిన్లు అందించారు.

More in Local