← Back to news

బాలానగర్‌లో ఘోర ప్రమాదం.. 13 ఏళ్ల బాలిక మృతి!

By Somireddy· 17h ago· Gajularamaram, Qutballapur, Medchal Malkajgiri
బాలానగర్‌లో ఘోర ప్రమాదం.. 13 ఏళ్ల బాలిక మృతి!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి నియోజకవర్గం బాలానగర్‌లోని ఎస్‌ఎంఆర్ వినయ్ క్యాపిటల్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న తల్లి, కూతుర్లను కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు కింద పడిన 13 ఏళ్ల బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చిత్రం : పోలీసులు విడుదల చేసిన బాలిక ఫైల్ ఫొటో)

More in Local