లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయాలి

భద్రాచలం నుంచి గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.



