← Back to news

GO 97 రద్దు చేయాలి: SFI

By Pramesh Aipsu· 17 Aug 2026· Nirmal
GO 97 రద్దు చేయాలి: SFI

TG: నిర్మల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట సోమవారం SFI ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ITI కళాశాలలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATC) మార్చే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిప్లొమా కోర్సులను ITI, ATCలతో అనుసంధానం చేయడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఎస్ఎఫ్ఎ జిల్లా కన్వీనర్ దిగంబర్ అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.97ను రద్దు చేసి, SBTET వ్యవస్థను కొనసాగించాలని కోరారు.

More in Education