← Back to news

విద్యార్థులకు కుంగ్‌ ఫూ స్పైరింగ్ క్యాంప్ పోటీలు

By Shirisha Chinthakindi· 16 Aug 2026
విద్యార్థులకు కుంగ్‌ ఫూ స్పైరింగ్ క్యాంప్ పోటీలు

TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని జీఎం పటేల్ మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన న్యూ మాక్స్ కుంగ్ ఫూ స్పైరింగ్ క్యాంపు పోటీలలో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చించోడ్ వర్సెస్ కొందుర్గ్ టీమ్ మధ్య ఉత్కంఠగా సాగిన పోటీల్లో చించోడ్ టీం చెందిన నక్షత్ర ‘మ్యాచ్ ఆఫ్ ది బెస్ట్’గా నిలిచింది. ఆమెను కోచ్ రమేష్, చీఫ్ మాస్టర్లు అభినందించారు. ముఖ్య అతిథిగా వనపర్తి జిల్లా చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ రాము మాస్టర్ హాజరయ్యారు. కార్యక్రమంలో రమేష్, రాము, బాల్ రాజ్, ప్రభు, కర్ణ, నహిద్, సురేష్ రాఘవేందర్ పాల్గొన్నారు.

విద్యార్థులకు కుంగ్‌ ఫూ స్పైరింగ్ క్యాంప్ పోటీలు

More in Local