కాన్షీరాంకు ఘన నివాళి

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో BSP వ్యవస్థాపకుడు మాన్యశ్రీ కాన్షీరాం వర్ధంతి సందర్భంగా బహుజన నాయకులు నివాళులర్పించారు. వెనుకబడిన, అణగారిన వర్గాల సామాజిక మార్పు, రాజకీయ సాధికారత కోసం కాన్షీరాం చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో BAMCEF, DS-4, 1984లో BSP స్థాపించి రాజకీయాల్లో మార్పు తెచ్చారని తెలిపారు. బహుజనుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బహుజన ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


